డ్యూడ్ సెకండ్ సింగిల్ అప్డేట్ రానుంది

Update on Dude’s Second Single on the Way

కోలీవుడ్ యంగ్ హీరో & డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో డ్యూడ్ ఒకటి. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.తమిళంలో ఈ సంస్థకు ఇది రెండో సినిమా.కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు.షూటింగ్ కూడా ఫైనల్ కు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా ఈసినిమా నుండిఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సెకండ్ సింగిల్ కూడా రానుంది. రేపు ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ కానుందో చెప్పనున్నారు.యూత్ ఫుల్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.డ్యూడ్ దీపావళికి రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. అయితే అదే టైం లో ఎల్ఐకె కూడా వస్తుంది.

ఇందులో కూడా ప్రదీప్ రంగనాథనే హీరోగా నటిస్తుండగా విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు.నిజానికి ఈసినిమా సెప్టెంబర్ లోనే రావాల్సింది కానీ అనుకున్న టైం కు రెడీ కాకపోవడంతో మేకర్స్ అక్టోబర్ 17న రిలీజ్ చేస్తున్నామని రీసెంట్ గా ప్రకటించారు.అయితే ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటే దీపావళికి రిలీజ్ అవుతుందని ప్రదీప్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. సో మరి ఈ రెండింట్లో ఏది వెనక్కి తగ్గుతుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.