అమెరికాలో అదరగొడుతున్న కిష్కింధపురి

Kishkindhapuri Conquers US Box Office With Sensational Collections

బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ ఫిల్మ్ ‘కిష్కింధపురి’ సినిమా సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది. ముఖ్యంగా, యునైటెడ్ స్టేట్స్ (USA) లో ఈ చిత్రం అంచనాలను మించి వసూళ్లను సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యుఎస్‌లో $250K+ గ్రాస్.. డబుల్ బ్లాక్‌బస్టర్ వైపు అడుగులు!

‘కిష్కింధపురి’ సినిమా యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే $200K+ వసూళ్లను సాధించి, ఇంకా ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టడం టాలీవుడ్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ విజయం ప్రేక్షకులకు సినిమా ఎంతగా నచ్చిందో తెలియజేస్తోంది. ‘మిరాయ్’ మరియు ‘లిటిల్ హార్ట్స్’ వంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, ‘కిష్కింధపురి’ తన సత్తా చాటుకుంది.

కాగా ప్రస్తుతం ‘కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ‘ఓజీ’ విడుదలయ్యే వరకు ఈ హవా కొనసాగుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం మొత్తం రన్‌లో సుమారుగా ₹30 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌కి గ్రాండ్ కమ్‌బ్యాక్

‘రాక్షసుడు’ తర్వాత సరైన విజయం లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఈ సినిమాతో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. బలమైన కథ, అద్భుతమైన నటనతో అతను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా నిర్మాణ విలువలు, దర్శకుడి పనితనం, మరియు నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.