మిలియన్ డాలర్ క్లబ్ లో చేరనున్న లిటిల్ హార్ట్స్

Little Hearts Racing Towards Million Dollar Club

చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించింది లిటిల్ హార్ట్స్. విడుదలైన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయగా ఆ తరువాత కూడా అదే జోరు కొనసాగించి ఏకంగా 30 కోట్ల కు పైగా వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చినా, మిగితా సినిమాలతో తీవ్ర పోటీ వున్నా ఈసినిమా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లతో అదరగొడుతుంది.నిన్నటి వరకు ఓవరాల్ గా 15కోట్లకుపైగా లాభాలను తీసుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు ఓవర్సీస్ లోనూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి వరకు అక్కడ 950K డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈ వీకెండ్ తో 1 మిలియన్ క్లబ్ లో చేరనుంది.ఓవరాల్ గా 2 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా బయ్యర్ల పాలిట జాక్ పాట్ లా మారింది.

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి ,యువ హీరోయిన్ శివాని నాగరం జంటగా నటించిన ఈసినిమాను సాయి మార్తాండ్ తెరకెక్కించాడు.యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో కామెడీ హైలైట్ అయ్యింది.#90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈసినిమాను నిర్మించాడు.ఇక ఈసినిమా టాలీవుడ్ టాప్ హీరోలను సైతం ఆకట్టుకుంది.మహేష్ బాబు ,అల్లు అర్జున్ ,నాని ,విజయ్ దేవరకొండ లిటిల్ హార్ట్స్ చూసి టీం పై ప్రశంసలు కురిపించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.