యంగ్ టాలెంటెడ్ నటుడు హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. ‘కోర్ట్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ తన బ్యానర్ కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండటంతో సినిమాకు మరింత బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆకట్టుకున్న టైటిల్ గ్లింప్స్
టైటిల్ గ్లింప్స్ సినిమా కథాంశంపై ఆసక్తిని పెంచుతోంది. హీరోయిన్‌ని కోసం ఆమె ఇంటికి వచ్చిన హీరో ఇల్లంతా వెతకడం, చివరకు తనని మేడపైన చూడటం, ఇద్దరి మధ్య సంభాషణ, ఆమె కోసం కొత్తగా తాను క్రియేట్ చేసిన సరికొత్త ట్యూన్ వినిపించడం.. వంటి సన్నివేశాలతో ఇంట్రస్టింగ్ గా సాగింది. చూస్తుంటే ఇది విలేజ్ నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమకథగా తెరకెక్కుతున్నట్టు అర్ధమవుతుంది. హీరో, హీరోయిన్ మధ్య లవ్, సున్నితమైన భావోద్వేగాలు కథలో కీలకం కానున్నాయని తెలుస్తోంది.
‘బ్యాండ్ మేళం’ సినిమా ఒక మంచి కథతో వస్తుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా, ‘కోర్ట్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న హర్ష రోషన్-శ్రీదేవి జోడిని మళ్ళీ తెరపై చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయి కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకు ఒక ప్రధాన బలం అని చెబుతున్నారు. మొత్తం మీద ఈ గ్లింప్స్ విజువల్స్, సంగీతం సినిమాపై మంచి ఫీల్‌ను కలిగిస్తున్నాయి.
ప్రముఖ సాంకేతిక నిపుణులతో ‘బ్యాండ్ మేళం’
ఇక ‘బ్యాండ్ మేళం’ కోసం బలమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడిగా విజై బుల్గానిన్, గీత రచయితగా చంద్రబోస్ వంటి ప్రముఖులు పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీని సతీష్ ముత్యాల అందిస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్ నార్ని శ్రీనివాస్ పనిచేస్తున్నారు. సినిమా స్క్రీన్‌ప్లే మరియు ఎడిటింగ్‌ను శివ ముప్పరాజు పర్యవేక్షిస్తున్నారు. కావ్య మరియు శ్రావ్య నిర్మిస్తుండగా, శివరాజు ప్రణవ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని కీలక అప్డేట్స్ వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























