లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆయన ఈ చిత్రాన్ని వీక్షించి తన స్పందనను తెలియజేశారు. ఈ సినిమా యువతను ఎంతగానో ఆకట్టుకుందని, అభినందిస్తూ ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్ వేదికగా, ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. ఈ మూవీపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ ప్రశంసలు..
మహేష్ బాబు తన పోస్ట్‌లో, “లిటిల్ హార్ట్స్ సినిమా… సరదాగా, కొత్తగా మరియు హృదయానికి దగ్గరగా ఉంది. నటీనటులందరూ అసాధారణమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా చిన్నపిల్లలు… వాళ్ళ నటన అద్భుతం. ఈ సినిమా ఒక అద్భుతమైన జాయ్ రైడ్” అని పేర్కొన్నారు. ఈ సినిమా చూసి తాను ఎంతగా ఆనందించారో ఈ మాటలు రుజువు చేస్తున్నాయి.
సంగీత దర్శకుడికి ప్రత్యేక సందేశం
ఈ చిత్రానికి సంగీతం అందించిన సింజిత్ యెర్రమిల్లిని ఉద్దేశించి మహేష్ బాబు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. “సింజిత్ యెర్రమిల్లి, నువ్వు దయచేసి ఫోన్ ఆపేసి ఎక్కడికీ వెళ్లవద్దు బ్రదర్.. రాబోయే రోజుల్లో నీకు చాలా బిజీగా ఉంటుంది. కీప్ రాకింగ్” అని మహేష్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఒక కారణం ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సింజిత్, మహేష్ బాబు తన సినిమాను మెచ్చుకుంటూ ఒక ట్వీట్ చేస్తే తాను సంతృప్తి చెంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక వారం పాటు దూరంగా వెళ్లిపోతానని చెప్పారు. ఇప్పుడు మహేష్ బాబు ట్వీట్ చేయడంతో సింజిత్ కల నిజమైంది.
కాగా, మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్‌పై నటుడు నిఖిల్ అబ్బూరి మరియు దర్శకుడు సాయి మార్తాండ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిన్న సినిమాకు మహేష్ లాంటి పెద్ద స్టార్ నుంచి ప్రశంసలు లభించడం ‘లిటిల్ హార్ట్స్’ బృందానికి గొప్ప ఆనందం మరియు గర్వకారణం” అని తెలిపారు.
‘చిన్న సినిమాకు అండగా స్టార్ హీరోలు’
మౌళి తనుజ్ మరియు శివాని నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చిన్న బడ్జెట్‌తో విడుదలైంది. అద్భుతమైన కథ, నటీనటుల నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పటికే నాని, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి అనేకమంది ప్రముఖ నటులు ఈ సినిమాను ప్రశంసించారు. ఇప్పుడు మహేష్ బాబు ప్రశంసలు ఈ సినిమా విజయాన్ని మరింత పెంచాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























