కాంతారా చాప్టర్ 1.. స్పెషల్ అట్రాక్షన్‌గా పంజాబీ స్టార్ సింగర్ పాట

Rishab Shetty Welcomes Punjabi Singer-Actor Diljit Dosanjh For Kantara Chapter 1 Album

‘కాంతార’ సినిమాతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి, ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో, ఈ సినిమా ఆల్బమ్‌లో పంజాబీ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ యాక్టర్-సింగర్ దిల్జిత్ దోసాంజ్ భాగం కాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘వరాహ రూపం’ నన్ను ఏడిపించింది

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్ షేర్ చేశారు. అందులో.. “బిగ్ బ్రదర్ రిషబ్ శెట్టి – మాస్టర్ పీస్ కాంతారను రూపొందించినందుకు సెల్యూట్. ఈ సినిమాతో నాకు వ్యక్తిగత అనుబంధం వుంది. వరాహ రూపం పాట థియేటర్లలో చూసినప్పుడు, ఆనందంతో ఏడ్చాను. అజనీష్ లోక్‌నాథ్‌కు కృతజ్ఞతలు. ఒక రోజులోనే తన నుంచి చాలా నేర్చుకున్నాను.” అని తెలిపారు.

శంభునాథుడి భక్తులు కలిశారు..

ఈ వీడియోకు రిషబ్ శెట్టి కూడా స్పందిస్తూ.. “దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి ‘కాంతార’ ఆల్బమ్‌లో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. శివుడి దయ వల్ల అన్నీ కుదిరాయి. మరొక శివ భక్తుడు ‘కాంతార’ టీమ్‌లోకి వచ్చారు” అంటూ ఆనందం వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం, అభిమానం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించాయి.

కాంతార: చాప్టర్ 1 ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ఇప్పటికే ‘కల్కి 2898 AD’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి ‘భైరవ ఆంథమ్’ పాడిన దిల్జిత్ దోసాంజ్, ఇప్పుడు రిషబ్ శెట్టితో కలిసి పనిచేయడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా, ఉత్తరాది ప్రేక్షకులకు ఈ పాట మరింత కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, సినిమాకు మరింత హైప్ తీసుకొస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా కాంతారా చాప్టర్ 1 కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్‌లో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.