సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ తరువాత భారతీయుడు 2, థగ్ లైఫ్ తో బ్యాక్ టు బ్యాక్ పరాజయాలను చవిచూశారు. జూన్ లో వచ్చిన థగ్ లైఫ్ అయితే చాలా నిరాశపరిచింది.ఇక ఈసినిమా రిజల్ట్ తో కొంచెం బ్రేక్ తీసుకున్న కమల్ నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా తన 237వ సినిమాను ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బ్ -అరివ్ లతో చేయనున్నారు.డైరెక్టర్స్ గా వీరికి ఇదే తొలి సినిమా.ఈసినిమాకు ప్రముఖ మలయాళ రైటర్ స్యామ్ పుష్కరన్ ను తీసుకున్నారు.ఇంతకుముందు తను కుంబలంగి నైట్స్ అలాగే ఇంకా పలు చిత్రాలకు పనిచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటెర్నేషల్ ఈసినిమాను నిర్మించనుంది.త్వరలోనే సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇక ఈసినిమాను పూర్తి చేసి కమల్ హాసన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ స్టార్ట్ చేయనున్నాడు.అందులో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్ లతో లోకేష్ కనగరాజ్ సినిమా చేయనున్నాడు.ప్రస్తుతం లోకేష్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఫస్ట్ టైం ఈసినిమాతో ఇద్దరిని ఓకే స్క్రీన్ పై చూపించనున్నాడు.వచ్చే ఏడాది ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























