తమిళనాడులో సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన కాంతార చాఫ్టర్ 1

Massive Pre-Release Business for Kantara Chapter 1 in Tamil Nadu

మచ్ అవైటెడ్ కాంతార ఏ లెజండ్ – చాప్టర్ 1 మరో 20రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కాంతర ప్రీక్వెల్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది.ఇప్పటికే అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. తెలుగులో దాదాపు 100కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఇక తమిళనాడులో అయితే 32 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.అక్కడ ఈసినిమా కెజియఫ్ 2 రేంజ్ లో వసూళ్లను రాబడుతుందని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అన్ని భాషల్లో కలిపి కాంతార చాప్టర్ 1 థియేట్రికల్ బిజినెస్ 300 కోట్లు దాటిందని టాక్.ఈలెక్కన బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా 600కోట్లకుపైన రాబట్టాల్సివుంటుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే టార్గెట్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాదాపు మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కాంతార.ఒక్క కన్నడ లోనే తెలుగు ,హిందీ భాషల్లో కూడా సెన్సేషన్ సృష్టించింది. ఇక కాంతరా చాప్టర్ 1 కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ట్రైలర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.అన్ని కుదిరితే ఈనెల 20న కాంతార చాఫ్టర్ 1 ట్రైలర్ రిలీజ్ కానుంది.ఈసినిమా ఓటీటీ డీల్ కూడా పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి.అమెజాన్ ప్రైమ్ రికార్డు ధరకు స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుందట.

రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.