రాఘవ లారెన్స్.. డ్యాన్స్ మాస్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా అందరికీ సుపరిచితం. ఈయనకు దయాగుణం కూడా చాలా ఎక్కువే. అవసరంలో ఉన్నవారికి, పేదవారికి, ఆపన్నులకు తన చేతనైనంత సాయం అందిస్తూ తన మంచి మనసుతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా, తాను చేసే సేవా కార్యక్రమాలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు రాఘవ. ఈసారి కూడా ఆయన ఒక అద్భుతమైన సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘కాంచన 4’ హాఫ్ షూట్ కంప్లీట్.. అడ్వాన్స్ డబ్బులతో స్కూల్ ఏర్పాటు!
ప్రస్తుతం ‘కాంచన 4’ సినిమా షూటింగ్ సగం పూర్తయిందని, అవుట్‌పుట్ చాలా బాగా వస్తుందని లారెన్స్ తెలిపారు. ఆయనకు సినిమా అడ్వాన్స్ వచ్చిన ప్రతిసారీ, ఒక కొత్త సామాజిక కార్యక్రమం ప్రారంభిస్తానని చెప్పారు. ఈసారి తాను తన మొదటి ఇంటిని పిల్లల కోసం ఒక ఉచిత పాఠశాలగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
ఆ ఇల్లు నాకు చాలా ప్రత్యేకం..
“ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకం. ఇది నేను డ్యాన్స్ మాస్టర్‌గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు. నేను దాన్ని పిల్లల కోసం ఒక అనాథాశ్రమంగా మార్చి, నా కుటుంబాన్ని అద్దె ఇంటికి మార్చాను. ఇప్పుడు నా ఇంట్లో పెరిగిన పిల్లలు పెద్దవారయ్యారు, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకే, ఈ ఇంటిని మరోసారి ఒక మంచి పనికి అంకితం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది” అని లారెన్స్ ఎమోషనల్‌గా పంచుకున్నారు.
మొదటి టీచర్.. తన ఇంట్లో పెరిగిన పిల్లలే!
లారెన్స్‌ను మరింత సంతోషానికి గురిచేసిన మరో విషయం ఏమిటంటే, ఆ పాఠశాలలో మొదటి టీచర్‌గా తన ఇంట్లో పెరిగి, ఇప్పుడు చదువుకుని సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయిని నియమించడం. తన పిల్లలు చదువుకుని, సమాజానికి తిరిగి సేవ చేయాలన్న ఆకాంక్ష లారెన్స్ అంకితభావానికి నిదర్శనం.
లారెన్స్ ఈ కొత్త కార్యక్రమానికి అందరి ఆశీస్సులు కోరారు. ఎప్పటిలాగే ప్రేక్షకులు తనను, తన సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలని తాపత్రయపడే రాఘవ లారెన్స్ నిజంగానే ‘మానవత్వం’ అనే పదానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఆయనకు అభినందనలు!
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























