సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ముందు ఈసినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ డేట్ కి సినిమా రెడీ అయ్యాలే లేకపోవడంతో వాయిదా వేశారు.ఇక అఖండ 2 ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని సమాచారం.రికార్డు ధరకు నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను దక్కించుకుందట.అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటించగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.డిసెంబర్ 5న ఈసినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
ఇక వరుస సక్సెస్ లతో పీక్ ఫామ్ లో వున్న బాలకృష్ణ నెక్స్ట్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు ఈ కాంబోలో వీర సింహా రెడ్డి రాగ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా చేయనున్నారు.వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈసినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























