తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన మదరాసి గత శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చి రివ్యూస్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.ముఖ్యంగా తమిళనాడులో అదరగొడుతుంది.రెండు రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లను రాబట్టుకోగా మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించి ప్రపంచ వ్యాప్తంగా 3రోజుల్లో 62కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తెలుగులో ఈసినిమాకు భారీ పోటీ ఎదురుకావడంతో డీసెంట్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సివస్తుంది.స్టార్ట్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు.శ్రీ లక్ష్మి మూవీస్ నిర్మించింది.
ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం పరాశక్తి లో నటిస్తున్నాడు.ఇది తనకు 25వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీని సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండగా శ్రీలీల, అథర్వ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























