రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది జైలర్.ఈసినిమా దాదాపు 600 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతుంది.ఈసీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ జాయిన్ అయ్యారు నిన్నటి నుండి శివ రాజ్ కుమార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంలో శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించారు.పవర్ ఫుల్ పాత్రలో స్క్రీన్ పై కనిపించిన ప్రతి సారి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టారు.ఇక ఇప్పుడు జైలర్ 2లోనూ ఆయన కనిపించనున్నారు.
ఇక ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ గోవాలో జరుగనుంది.ఇందుకోసం భారీ సెట్ వేస్తున్నారు.ఇందులో క్లైమ్యాక్స్ షూట్ చేయనున్నారు.నవంబర్ లో ఈ షెడ్యూల్ జరుగనుంది.దాంతో షూట్ కంప్లీట్ కానుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.2026 సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























