ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఇక రీసెంట్ గా ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇప్పటికీ ఆ సాంగ్ మ్యూజిక్ యాప్ లలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు సెకండ్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు.టీజ్ సాంగ్ నేపథ్యంలో పప్పీ షేమ్ అంటూ వచ్చిన ఈ పాటను రామ్ పాడడం విశేషం.సాంగ్ విషయానికి వస్తే లిరిక్స్ క్యాచీ గా ఉండగా బీట్స్ అదిరిపోయాయి.ఓవరాల్ గా సెకండ్ సింగిల్ కూడా రిపీట్స్ లో వినేలావుంది.భాస్కర భట్ల ఈసాంగ్ రచించగా ఇందులో రామ్ స్టెప్స్ హైలైట్ అవ్వనున్నాయి.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు.పి డైరెక్షన్ లో హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుండగా రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుంది.తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28 న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లోకి రానుంది.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























