సాంగ్ షూట్ లో మన శంకరవరప్రసాద్ గారు

mana Shankara Vara Prasad Garu Takes Part in Song Filming

మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక కొద్దీ రోజుల క్రితం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వగా ఈరోజు నుండి సాంగ్ షూట్ జరుగుతుంది.చిరు – నయనతార పై ఈషూట్ జరుగుతుండగా విజయ్ పోలంకి మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇదే షెడ్యూల్ ఈనెల 19న వరకు జరుగనుండగా ఇందులో మరో సాంగ్ షూట్ చేయనున్నారు.దాంతో సగానికిపైగా షూట్ కంప్లీట్ కానుంది. నవంబర్ కల్లా షూట్ పూర్తి కానుంది.దాంతో అనుకున్నటైంకు సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈసినిమా షూటింగ్ లో విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడని తెలిసిందే. అక్టోబర్ నుండి వెంకీ కూడా షూట్ లో జాయిన్ కానున్నాడు.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ ,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.