ఈసారి సంక్రాంతి బరిలో రవితేజ

Mass Maharaja Ravi Teja's RT 76 to be Released in 2026 Pongal

మాస్ మహారాజా రవి తేజ మరియు దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో వస్తున్న చిత్రం RT 76. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLVC) బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా, అక్టోబర్ చివరికి పూర్తికానుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించనుంది చిత్ర బృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మచ్ అవైటెడ్ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్టు యూనిట్ వర్గాల సమాచారం. దీంతో రవితేజ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఎందుకంటే, తెలుగునాట పండుగ సీజన్‌లో వచ్చే సినిమాలు దాదాపు సూపర్ హిట్ అవుతుంటాయి. అందుకే ఇప్పుడు ఈ వార్త మాస్ మహారాజా అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది.

సాధారణంగా మాస్ యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన రవితేజ, సున్నితమైన కథలను అద్భుతంగా తెరకెక్కించే కిషోర్ తిరుమల కాంబినేషన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. భీమ్స్ తన పాటలతో ఇప్పటికే యువతను ఉర్రూతలూగిస్తున్నారు. రవితేజ మాస్ ఎనర్జీ, కిషోర్ తిరుమల ఎమోషనల్ టచ్, మరియు భీమ్స్ సంగీతం కలగలిపి ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన సినిమాగా మారుస్తాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

ఈ కొత్త, అరుదైన కాంబినేషన్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచింది. సంక్రాంతి పండుగకు ఈ చిత్రం ఒక పెద్ద విజయాన్ని సాధించి, అభిమానులకు ఒక గొప్ప కానుకగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.