హీరో అల్లరి నరేష్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ మళ్ళీ ఫుల్ బిజీ అవుతున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి 12 ఏ రైల్వే కాలనీ కాగా మరొకటి ఆల్కహాల్.ఇక ఈరోజు నరేష్ నెక్స్ట్ సినిమా కూడా లాంఛ్ అయ్యింది.నరేష్ కి ఇది 65 వ సినిమా.అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీ ఓపెనింగ్ జరుగగా దీనికి నాగ చైతన్య ,డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.నరేశ్ కంఫర్ట్ జోన్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాకు రంభ ఊర్వశి మేనకా అనే టైటిల్ ను అనుకుంటున్నారట.చంద్ర మోహన్ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.హాస్య మూవీస్ ,అన్నపూర్ణ స్టూడియోస్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నరేష్ నెక్స్ట్ 12 ఏ రేల్వే కాలనీ తో రానున్నాడు.పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ ఈసినిమాకు రైటర్ గా పనిచేస్తున్నాడు.షూటింగ్ కూడా చివరి దశ చేరుకుంది.నాని కసరగడ్డ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఇందులో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తుంది.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.
ఇక ఆల్కహాల్ విషయానికి వస్తే సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై అంచనాలు వున్నాయి.రెండు రోజల క్రితం టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.మెహర్ తేజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రుహాణి శర్మ ,నిహారిక ఎన్ ఎమ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.జనవరి 1న ఈసినిమా థియేటర్లోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























