మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది. ఇటీవలే కేరళ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ, ఈరోజు కొత్త షెడ్యూల్ ప్రారంభించుకుంది. ఇందులో చిరంజీవి సహా కీలక తారాగణం అంతా పాల్గొననుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా-విక్టరీ కాంబినేషన్
ఇక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ విక్టరీ వెంకటేష్. ఇందులో ఆయన ఓ అతిథి పాత్రలో నటిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌కు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం తెలిసిందే. వచ్చే నెలలో మొదలవనున్న నెక్స్ట్ షెడ్యూల్‌లో వెంకటేష్ జాయిన్ కాబోతున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ తొలిసారి ఒకే సినిమాలో నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. అందుకే ఇరువురి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ మరియు యాక్షన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























