అందుకే మదరాసి అనే టైటిల్ పెట్టా  – ఏఆర్ మురగదాస్ 

Madharaasi Director AR Murugadoss Interview

శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్ జంటగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం మదరాసి.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించగా శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించింది.అమరన్ తరువాత శివ కార్తికేయన్ నుండి వస్తున్న సినిమా కావడంతో మదరాసిపై మంచి అంచనాలు వున్నాయి.ఈనెల 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ 5న మదరాసి చిత్రం రాబోతోంది డైరెక్టర్‌గా మీకు ఎలా అనిపిస్తోంది?

నేను ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావిస్తాను. మదరాసి విషయంలోనూ అలాంటి ఫీలింగ్‌‌తోనే ఉన్నాను.డిఫరెంట్ కథతో అందరి ముందుకు రాబోతోన్నాను. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాను.

మదరాసి టైటిల్ పెట్టడానికి గల కారణం ?

మామూలుగా మన దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు.ఈ చిత్రం ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. విలన్ ఈ మూవీలోని హీరోని మదరాసి అని పిలుస్తుంటాడు. అందుకే టైటిల్ కూడా మదరాసి అని పెట్టాను.

మదరాసి టైటిల్‌ను ఇతర ప్రాంతాల వారు రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారా?

మదరాసి కథ మొత్తంగా తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. అందుకే టైటిల్‌ అలా పెట్టాం.నేను బెంగళూరులో కథ జరుగుతుంటే  మదరాసి అని టైటిల్‌ను పెట్టలేను కదా.ఇందులోని కంటెంట్, కథ అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది.

మదరాసిలో కథ ఎలా ఉండబోతోంది?

వెస్ట్రన్ కంట్రీస్‌లో ఆల్రెడీ ఉన్న సమస్యలు, మన దేశంలోకి వస్తున్న ఇలాంటి ఓ కొత్త సమస్యను బేస్ చేసుకుని ఈ  మదరాసి కథను రాసుకున్నాను. ఇందులోని సబ్జెక్ట్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ అనుకుని..ఈ మదరాసి మూవీని తెరకెక్కించాను.

మదరాసి కోసం శివ కార్తికేయన్‌ను ఎందుకు అప్రోచ్ అయ్యారు?

మదరాసి చిత్రంలో హీరో పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. శివ కార్తికేయన్‌కు ఈ కథ చెప్పిన వెంటనే నచ్చడం, వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయింది. ప్రస్తుతం శివ కార్తికేయన్‌కు మాస్‌లో మంచి ఇమేజ్ పెరిగింది. అలాంటి మాస్ హీరోతో నేను చెప్పాలనుకున్న ఈ పాయింట్‌ను చెబితే ఎక్కువ రీచ్ అవుతుంది.

మదరాసిలో రుక్మిణి వసంత్ పాత్ర ఎలా ఉంటుంది?

మదరాసి చిత్రంలో రుక్మిణి వసంత్ పాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. అందరికి రిలీటే అయ్యే కారెక్టర్‌ను ఆమె చేశారు. ప్రస్తుతం రుక్మిణి వసంత్ గారు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు.

విద్యుత్ జమ్వాల్ ప్రస్తుతం హీరోగా చేస్తున్నారు. మీరు మళ్లీ విలన్ పాత్రకి ఎలా ఒప్పించారు?

తుపాకి కథను విద్యుత్ జమ్వాల్‌కి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయి ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. హాలీవుడ్ ప్రాజెక్ట్‌ని కూడా ఆయన చేస్తున్నారు. ఈ ‘మదరాసి’ కథను ఆయనకు చెప్పిన వెంటనే చాలా నచ్చడంతో విలన్‌గా చేసేందుకు ఒప్పుకున్నారు.

మీ చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉంటాయి. మరి మదరాసిలో ఎలా ఉండబోతోన్నాయి?

మదరాసిలో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే పోరాట సన్నివేశాలు అదిరిపోతాయి. హీరో, విలన్ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు ఆడియెన్స్‌ను అబ్బురపరుస్తాయి.

మదరాసిలో అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉండబోతోంది?

ప్రస్తుతం అనిరుధ్ మ్యూజిక్‌కు బ్రాండ్‌గా ఉన్నారు. ఇంత వరకు మ్యూజిక్ అంటే.. పాటలు, లిరిక్స్ అనుకునేవారు. కానీ అనిరుధ్ మాత్రం బీజీఎంతో దేశాన్ని ఊపేస్తున్నారు. ఈ చిత్రంలో అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు. నేను చేసిన సీన్లను అనిరుధ్ తన ఆర్ఆర్‌తో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లారు. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా అనిరుధ్ ఆర్ఆర్ ఇచ్చారు. అనిరుధ్ ఇంకా ఎంతో ఎత్తుకు వెళ్తారు. మ్యూజిక్‌ వరల్డ్‌లో ఇంకా గొప్ప స్థాయిని చేరుకుంటున్నారు.

మదరాసి విషయంలో నిర్మాత సపోర్ట్ ఎలా ఉంది?

శ్రీ లక్ష్మీ మూవీస్, ఎన్వీ ప్రసాద్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన ఈ మూవీ కోసం ఎంతో ఖర్చు పెట్టారు. అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీని నిర్మించారు.

మీకు ఐదేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది?

ఈ ఐదేళ్లలో నేను ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. మధ్యలో ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేశాను. కానీ చివరకు అది మెటీరియలైజ్ అవ్వలేదు. టెక్నీషియన్‌గా నేను ఎప్పుడూ ఖాళీగా అయితే లేను. ఆ ప్రాజెక్ట్ వల్లే చాలా టైం వృథా అయింది. అందుకే ఈ గ్యాప్ వచ్చింది.

మన సౌత్ ఇండియన్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోంది కదా?

సౌత్‌లో మన ఆడియెన్స్ సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారు. సినీ లవర్స్ మన దగ్గరే ఎక్కువగా ఉంటారు. ఓ నలుగురు కలిస్తే కచ్చితంగా సినిమా గురించి మాట్లాడుకుంటారు. మన దగ్గర ప్రస్తుతం ప్రపంచస్థాయి కంటెంట్ వస్తోంది. మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది.

మీ ప్రొడక్షన్ కంపెనీలో నెక్ట్స్ మూవీ ఎప్పుడు రాబోతోంది?

చాలా కథలు వింటున్నాను. అందులో కొన్ని ఫైనలైజ్ చేశాం. కానీ వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. త్వరలోనే మా ప్రొడక్షన్ కంపెనీ నుంచి పట్టాలెక్కే చిత్రాల గురించి అప్డేట్ ఇస్తాను.

దర్శకుడిగా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి?

ప్రస్తుతానికి నా వద్ద చాలా ఐడియాలు, కాన్సెప్ట్‌లు ఉన్నాయి. కానీ పర్టిక్యులర్‌గా ఈ మూవీ అని ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యాక నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెబుతాను.

ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : :point_down:
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్
 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.