మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన భారీ పాన్ఇండియా మల్టీస్టారర్ మూవీ “కన్నప్ప” ఇప్పుడు డిజిటల్ వేదికపైకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ మేరకు సదరు ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ శివభక్తుడైన కన్నప్ప చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహాశివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా నటించారు. థియేటర్లలో ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రదర్శించిన విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశాయి.
ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రుద్ర’ అనే ప్రత్యేక పాత్రలో కనిపించి సందడిచేశారు. ఆయన లుక్, గెటప్ వైరల్ అయ్యి, సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అయింది. అలాగే మోహన్‌లాల్, మోహన్‌బాబు, శరత్ కుమార్, మధుబాల వంటి స్టార్ తారాగణం కీలక పాత్రల్లో కనిపించడం సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ.
ఇంకా మంచు ఫ్యామిలీ మూడో తరం ఈ సినిమాతో తెరంగేట్రం చేయడం విశేషం. విష్ణు కుమారుడు అవ్రామ్, కుమార్తెలు అరియనా, వివియానా కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్స్‌తో తీర్చిదిద్దగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ అందించిన సంగీతం మరింత గ్రాండ్ ఫీలింగ్ ఇచ్చింది.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇంట్లోనే థియేటర్ ఫీల్‌తో ఈ అద్భుతమైన విజువల్ వండర్ని చూసే అవకాశం లభించింది. ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్లో “కన్నప్ప” ట్రెండింగ్‌లో నిలుస్తూ, భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. సో.. మూవీ లవర్స్.. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























