తమిళ హీరో సూర్య రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ ఫుల్ బిజీ అవుతున్నాడు.రీసెంట్ గానే కరుప్పు సినిమాను కంప్లీట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమాలో నటిస్తున్నాడు.సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇందులో సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మమితా బైజు నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.నవంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది వేసవి లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత సూర్య నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పాడు.అందులో భాగంగా తన 47వ సినిమాను మలయాళ దర్శకుడు, ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్ లో చేయనున్నాడని సమాచారం.ఈసినిమా కోసం హీరోయిన్ గా నజ్రియా నజీమ్ ను తీసుకోవాలనుకుంటున్నారట.త్వరలోనే ఈసినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.సూర్య సొంత నిర్మాణ సంస్థ 2 డి ఎంటర్టైన్మెంట్ సూర్య 47ను నిర్మించే ఛాన్స్ వుంది.
ఇక ఈ ఏడాది సమ్మర్ లో సూర్య రెట్రోతో రాగ ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక నెక్స్ట్ కరుప్పుతో నైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు సూర్య.ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటించింది.త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























