ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ 2 అధినేత బన్నీ వాసు ఇటీవల కొత్తగా బీవీ వర్క్స్ పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు.ఈ బ్యానర్ నుండి ఫస్ట్ వస్తున్న సినిమా మిత్రమండలి. సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాడు బన్నీ వాసు. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 16న మిత్రమండలి థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫన్, మిస్టరీ జానర్‌లో తెరకెక్కుతున్న మిత్ర మండలి చిత్రంతో విజయేందర్ ఎస్ దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్నాడు. ఇందులో ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు కీలక పాత్రల్లో నటించగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇక మూవీ నుండి టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.జాతి రత్నాలు టైప్ ఆఫ్ కామెడీ తో రానున్న సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























