మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాత గా యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా లోకః చాప్టర్ 1 – చంద్ర.గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.నిన్న ఒక్క రోజే 5కోట్లకు పైగా రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా కేరళ లో 16కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అయితే 60కోట్ల కు పైగా సొంతం చేసుకుంది. ఈరోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 150కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో కొత్త లోక గా విడుదలై సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.మౌత్ టాక్ కి తోడు రివ్యూస్ పాజిటివ్ గా రావడంతో తెలుగులో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. చివరి 24 గంటల్లో తెలుగు వెర్షన్ బుక్ మై షోలో 33 వేలకుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి.ముఖ్యంగా మల్టీ ఫ్లెక్స్ లలో అదరగొడుతుంది. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు.ఫుల్ రన్ లో బయ్యర్లకు ఈసినిమా మంచి లాభాలను తీసుకురానుంది.
డొమినిక్ అరుణ్ డైరెక్షన్ లో సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లేన్ , శాండీ కీలక పాత్రల్లో నటించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.ఇక ఈసినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుండడంతో ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ వుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























