అందుకే తెలుగు సినిమాలు 1,000 కోట్లు కొడుతున్నాయి – శివకార్తికేయన్

Sivakarthikeyan Reveals The Secret Behind, Telugu Films Collecting 1000 Cr

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటులలో ఒకరైన శివకార్తికేయన్, ఇటీవల తెలుగు సినిమాలు సాధిస్తున్న భారీ విజయాల గురించి మాట్లాడారు. తెలుగులో తరచూ రూ.1,000 కోట్ల కలెక్షన్లను సాధించడానికి ఉన్న అసలు కారణాన్ని ఆయన చెప్పడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. సాధారణంగా, తమిళ దర్శకులు తమ సినిమాలు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని భావిస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన కొత్త సినిమా ‘మదరాసి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ లో ఆయన తెలుగు సినిమాల విజయ రహస్యాన్ని చెప్పారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో, కంటెంట్ బాగుంటే నిర్మాతలు బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయరని శివకార్తికేయన్ చెప్పారు. నటుడు శివకార్తికేయన్ తెలుగు సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

విజయ రహస్యం..

“నేను ఎప్పటినుంచో చెప్పాలనుకున్న మాట ఇది. తెలుగు నిర్మాతలు కథపై నమ్మకం ఉంటే, ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే, ఇక్కడ 1000 కోట్ల సినిమాలు తరచూ వస్తున్నాయి” అని శివకార్తికేయన్ అన్నారు. ఆయన మాటలు తెలుగు చిత్ర పరిశ్రమలోని మేకర్స్ విజన్‌ని, ధైర్యాన్ని, మరియు వృత్తి నైపుణ్యాన్ని హైలైట్ చేస్తున్నాయి.

సందేశం Vs వినోదం

కాగా డైరెక్టర్ మురుగదాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో “తమిళ దర్శకులు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమాలు తీయరు, వారు ప్రజలకు ఏదైనా నేర్పించాలనుకుంటారు” అని వ్యాఖ్యానించారు. మురుగదాస్ మాటలకు భిన్నంగా శివకార్తికేయన్ తెలుగు చిత్ర పరిశ్రమను ప్రశంసించడం గమనార్హం. శివకార్తికేయన్ దర్శకుడు మురుగదాస్ తో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి.

ఇక శివకార్తికేయన్ తన ప్రసంగంలో తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. “తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్‌ని ఎప్పుడూ ఆదరిస్తారు. వారికి మంచి సినిమాను ఇస్తే, వారు ప్రేమను కురిపిస్తారు” అని అన్నారు. అలాగే ‘మదరాసి’ సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంత పాత్ర, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని చెప్పారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.