కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ అభిమానులకు ఒక శుభవార్త. ఆయన త్వరలో ఒకఇంటివాడు కాబోతున్నాడు. నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం నిన్న రాత్రి జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే నేడు విశాల్ బర్త్ డే సందర్భంగా ఈ గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకోవడం మరింత విశేషంగా మార్చింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక నిశ్చితార్థం సందర్భంగా ఈ స్టార్ కపుల్ చాలా సంతోషంగా కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థ వేడుక చాలా సింపుల్‌గా, సాంప్రదాయ పద్ధతిలో జరిగిందని తెలుస్తోంది. త్వరలో వీరు వివాహ బంధంతో ఒక్కటవుతారని, ఆ తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఒక గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
అయితే ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాల్ మరియు సాయి ధన్సికల జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
విశాల్ మరియు సాయి ధన్సికలు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని సినీ వర్గాల్లో ఒక ఊహాగానం ఉంది. ఇప్పుడు ఈ వార్త నిజం కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వారి వివాహ తేదీని కూడా ప్రకటిస్తారని ఆశిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























