తమిళ స్టార్ హీరో విజయ్ -ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జన నాయగన్.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు విజయ్.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.ఇంతకుముందు ఈసినిమా నుండి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ వదలడానికి రెడీ అవుతున్నారు.అన్ని కుదిరితే దీపావళికి జన నాయగన్ ఫస్ట్ సాంగ్ రానుంది. అనిరుధ్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తుండడంతో ఆడియోపై కూడా భారీ అంచనాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.జనవరి 9న ఈసినిమా రిలీజ్ కానుంది.ఇక తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా రిలీజ్ కానుంది.అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.దాంతో జన నాయకుడు కి తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.
ఇక విజయ్ కి ఈసినిమానే చివరిది కానుంది.ఇప్పటికే విజయ్ సొంతంగా పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ ని బరిలోకి దింపనున్నాడు.ప్రస్తుతం విజయ్ ఫుల్ టైం పొలిటీషియన్ గా బిజీ అవుతున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























