తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారు తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, సినిమా షూటింగ్‌ల అనుమతులు, థియేటర్ల నిర్వహణ, సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు, సినీ కార్మికుల సమ్మె వంటి విషయాలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన పలు కీలక సలహాలు మరియు సూచనలు..
- సినిమా కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
- సినీ కార్మికులను, నిర్మాతలను ప్రభుత్వం కాపాడుకుంటుందని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి సమగ్రమైన విధానం తీసుకొస్తే బాగుంటుందని అన్నారు.
- సినిమా పరిశ్రమలో సుహృద్భావ పని వాతావరణం ఉండాలని, సినిమా పరిశ్రమకు నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు.
- సమస్యలపై సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని సీఎం చెప్పారు.
- సినిమా పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి స్కిల్స్ పెంచుకునేలా చర్యలు ఉండాలని, పరిశ్రమలో వివిధ అంశాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి ఒక కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
- ఆయా విభాగాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వివరించారు.
- తెలంగాణలో ఒక ముఖ్యమైన పరిశ్రమగా తెలుగు సినిమా రంగం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని ముఖ్యమంత్రి చెప్పారు.
- సినిమా పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల విషయంలో సంస్కరణలు అవసరమని చెప్పారు. పరిశ్రమకు ఏం కావాలో ఒక నియమావళి నిర్దేశించుకుంటే మంచిదన్నారు.
- సినీ పరిశ్రమ విషయంలో నిష్పాక్షికంగా ఉంటానని, పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
- హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి.
- అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే ధ్యేయమని స్పష్టంగా చెప్పారు.
కాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, డీవీవీ దానయ్య, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, సాహు గారపాటి, అనిల్ సుంకర, ఎస్కేఎన్, స్రవంతి రవికిషోర్, శరత్ మరార్, మైత్రీ నవీన్, జెమిని కిరణ్, చెరుకూరి సుధాకర్, ఎన్వీ ప్రసాద్, రాధామోహన్, దాము తదితరులు పాల్గొన్నారు. అలాగే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ ఓదెల, వెంకీ కుడుముల తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినవారిలో ఉన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























