యంగ్ హీరో రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్

Pradeep Ranganathan’s Box Office Clash with His Own Films

కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కోమాలితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రదీప్.అయితే ఆ తరువాత లవ్ టుడే తో హీరోగా మారాడు.ఈసినిమా ఏకంగా 100 కోట్లపైనే రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఇక రీసెంట్ గా డ్రాగన్ తో రాగ ఈసినిమా కూడా 100 కోట్ల పైనే రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈరెండు సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి.దాంతో ప్రదీప్ నటిస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రదీప్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.రెండు సినిమాల షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ కి చేరుకొంది.అందులో ఒకటి ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కాగా మరొకటి డ్యూడ్.ఎల్ఐకె ను విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది.ఈసినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది కానీ ఆ టైంకి రెడీ కాకపోనుండడంతో వాయిదా వేశారు.రెండు రోజుల క్రితం కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ కానుందని చెప్పేశారు.

అయితే డ్యూడ్ దీపావళికి రిలీజ్ కానుందని మూవీ అనౌన్స్ మెంట్ రోజే ప్రకటించారు మేకర్స్.కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఇప్పుడు ఎల్ఐకె ఆ స్లాట్ తీసుకోవడంతో డ్యూడ్ వాయిదాపడుతుందని అందరు అందుకున్నారు. కానీ నిన్న డ్యూడ్ అప్డేట్ ఇస్తూ దీపావళికే రిలీజ్ అవుతుందని ట్విస్ట్ ఇచ్చారు. దాంతో ఒకే హీరో నటిస్తున్న రెండు సినిమాలు ఒకేసారి ఎలా వస్తాయని గందరగోళం ఏర్పడింది.పైగా మంచి మార్కెట్ వున్న హీరో కావడంతో రెండు సినిమాలను ఒకే సారి విడుదల చేస్తే నష్టం తప్పదు. మైత్రి ముందు నుండే అదే డేట్ కు స్టిక్ అవ్వడంతో వారు వెనక్కి తగ్గలే కనిపించడం లేదు.సో ఎల్ఐకె వీలైనంత తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ చివర్లో విడుదలచేసుకోవాలి.లేదంటే రిలీజ్ వాయిదా వేసుకోవాలి.మరి ఏమవుతుందో చూడాలి.త్వరలోనే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఓ క్లారిటీ రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.