కిష్కింధపురి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

Kishkindhapuri Teaser Release Date Locked

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా కిష్కింధపురి.ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన రాక్షసుడు సూపర్ హిట్ అనిపించుకోగా ఇక ఇప్పుడు ఈ పెయిర్ కిష్కింధపురి తో రానున్నారు.చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి  ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఆగస్టు 15న సాయంత్రం 4:05 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మరి ఈ టీజర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.ఈసినిమాకు సామ్ సీఎస్ ,చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 12న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. 


ఇక ఈసినిమా కాకుండా సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు ,హైందవ సినిమాలు కూడా చేస్తున్నాడు.టైసన్ నాయుడుని భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.హైందవను లుధిర్ బైరెడ్డి డైరెక్ట్ చేస్తుండగా అకల్ట్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా మూన్ షైన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.మరి ఈమూడు సినిమాలతో సాయి శ్రీనివాస్ కు హ్యాట్రిక్ హిట్స్ కొడతాడో చూడాలి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.