మెగా 157 నుండి వచ్చే అప్డేట్ ఇదే 

Here’s the Upcoming Update from Mega 157

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మెగా 157.ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి.సెట్స్ మీదకు వెళ్ళనిప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా  ఫాస్ట్ గా  షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా.నెలన్నర గ్యాప్ లో మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.ఈ షెడ్యూల్స్ లో ఫస్ట్ హాఫ్ షూట్ చేశారు.ఇంకో సీక్వెన్స్ బ్యాలెన్స్ వుంది. అది చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయ్యినట్లే. అయితే ఈనెల 5న కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సివుండగా ఫెడరేషన్ స్ట్రైక్ తో వాయిదాపడింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈనెల 22 న అప్డేట్ రానుందని తెలిసిందే.ఆ అప్డేట్ ఏంటో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టాడు అనిల్.సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్  అలాగే గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నామని  అనిల్ రావిపూడి తెలిపారు. 

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుండగా  విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్ ,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.