బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’. సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగష్టు 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింద్. ఈ ట్రైలర్ గమనిస్తే.. పంజాబీ, మలయాళీ జంట మధ్య జరిగే ప్రేమ కథగా రూపొందినట్టు అర్ధమవుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కూడా లోటు లేనట్టుగా ఉంది. అయితే ట్రైలర్‌లో హైలైట్ ఏంటంటే..? జాన్వీ కపూర్ ప్రముఖ సౌత్ హీరోలను ఇమిటేట్ చేసింది.
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మరియు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లను అనుకరించింది. ‘పుష్ప’ సినిమాలో గడ్డం కింద చెయ్యి పెట్టుకుని స్టైల్‌గా ‘తగ్గేదేలే’ అన్నట్టుగా అల్లు అర్జున్ చేసినట్టే చేసింది జాన్వీ. కాగా ఈ స్టార్ హీరోలను జాన్వీ ఇమిటేట్ చేస్తున్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























