మాస్ జాతర టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Mass Jathara Teaser Release Date Fix

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్‌గా ఉన్న ఈ మూవీ రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌, రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా త్వరలో మాస్‌ జాతర టీజర్‌ను విడుదల చేయనున్నారు. వచ్చే సోమవారం (ఆగస్టు 11) రోజున ఈ టీజర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు నేడు సోషల్ మీడియాలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలోకి సోలోగా రానుండటం కలిసిరానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.