రామ్ పోతినేని చేతులమీదుగా.. పరదా ట్రైలర్ రిలీజ్

Anupama Parameswaran's Paradha Trailer Out

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పరదా’. స్టార్ యాక్ట్రెస్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి, తన తొలి చిత్రం ‘సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదల ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో, సినిమా టీజర్‌ మరియు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పరదా మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఈ ట్రైలర్‌ను లాంచ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. మృదుల్ సుజిత్ సేన్ డీవోపీగా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా, శ్రీనివాస్ కళింగ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా పరదా చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌ ఫేమ్ రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు. ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.