ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో నేను ఎలాంటి చర్చలు జరుపలేదు – చిరంజీవి 

Chiranjeevi Clarifies No Talks Held with Film Federation Members

ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో నేను ఎలాంటి చర్చలు జరుపలేదు – చిరంజీవి గత కొన్ని రోజుల నుండి  సినీ కార్మికులు వేతన పెంపు కోసం షూటింగ్ లు ఆపేసిన  విషయం తెలిసిందే .ఫిలిం ఫెడరేషన్ అలాగే నిర్మాతలకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో  స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నారు.ఈ విషయం పై నిర్మాతలు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని అలాగే  బాలకృష్ణ ను కలిసి  చర్చించగా ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో  మాట్లాడి  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.అయితే ఇంతలోనే కొందరు తాము ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని, చిరంజీవిని  కలిసి తమ డిమాండ్లను వివరించామని అందుకు చిరంజీవి  ఒప్పుకొనట్లు వార్తలు బయటికి వచ్చాయి. ఇక ఈ రూమర్స్  చిరంజీవి దాక వెళ్లడంతో  దీనిపై  ఆయన  సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొంతమంది తమను ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటూ, నేను వారిని కలసి 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరిస్తానని, అలాగే నేను త్వరలో షూటింగ్ ప్రారంభిస్తానని హామీ ఇచ్చానని మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది.

ఈ సందర్భంగా  నేను క్లారిటీ ఇస్తున్నాను…  నేను ఇప్పటివరకు ఎవరినీ కలవలేదు. ఇది మొత్తం సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్య.కాబట్టి  వ్యక్తిగతంగా  హామీ ఇవ్వడం లేదా సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు.

తెలుగు సినిమా పరిశ్రమలో ఫిలిం ఛాంబరే  అగ్రస్థాయి సంస్థ. ఈ సమస్యపై అన్ని వర్గాలతో చర్చలు జరిపి, న్యాయమైన పరిష్కారానికి ఫిలిం ఛాంబరే బాధ్యత వహిస్తుంది. 

అంతవరకు ఈ తరహా తప్పుడు మరియు ప్రేరేపిత ఆరోపణలు చేసి, వర్గాల మధ్య గందరగోళం సృష్టించే ప్రయత్నాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చిరంజీవి ఎక్స్ లో ట్వీట్ చేశారు.


ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.