3 ఏళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కన్నడ సినిమా కాంతార.ఒక్క కన్నడ లోనే కాదు తెలుగు , హిందీ భాషల్లో కూడా ఈసినిమా ఊహించని కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇక ఈసినిమాకి సీక్వెల్ కూడా వస్తుంది.కాంతార చాప్టర్ 1 అనే టైటిల్ తో దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు రుక్మిణి బర్త్ డే కావడంతో సినిమా నుండి తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి విషెస్ చేసింది టీం.ఈపోస్టర్ లో యువ రాణి గెటప్ లో కనిపించింది రుక్మిణి. ఈసినిమాలో తను కనకావతి పాత్రలో కనిపించనుంది.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.సినిమా కూడా బాగా వస్తుందని టాక్.సీక్వెల్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దాంతో మొదటి రోజు కాంతార చాప్టర్ 1 రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.అజనీష్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా టాప్ బ్యానర్ హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.అన్ని భాషల్లో ఈసినిమా అక్టోబర్ 2న విడుదలకానుంది.
ఇదిలావుంటే తెలుగులో రిషబ్ శెట్టి ప్రస్తుతం జై హనుమాన్ చేస్తున్నాడు.హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఇక రీసెంట్ గా రిషబ్ మరో సినిమాకు సైన్ చేశాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గుణ్ణం డైరెక్షన్ లో రిషబ్ శెట్టి సినిమా చేయనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మించనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























