నటీనటులు: ప్రవీణ్, వైవా హర్ష, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్, జబర్థస్త్ అప్పారావు తదితరులు
సంగీతం: వికాస్ బడిస
సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి
ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్
నిర్మాణం: ఎస్‌జే మూవీస్ బ్యానర్
నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి
దర్శకత్వం: ఎస్‌జే శివ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైవిధ్యమైన పాత్రలతో, విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన తొలిసారిగా హీరోగా నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. మరో కమెడియన్ వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటించాడు. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హారర్ థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్ అన్నీ రకాల అంశాల మేళవింపుతో రూపొందింది.
ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హోం బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది. అయితే కమెడియన్ ప్రవీణ్ తొలిసారి హీరోగా చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఆయన తన నటనతో ఆడియెన్స్‌ని మెప్పించాడా? దర్శకుడిగా ఎస్‌జే శివ సక్సెస్ అయ్యాడా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన పరమేశ్ (ప్రవీణ్) తన నలుగురి స్నేహితులతో కలిసి ఒక రూమ్‌లో ఉంటుంటాడు. తనకి ఒక పెద్ద హోటల్ బిజినెస్ చేయాలనేది కల. కాకపోతే కుటుంబ పరిస్థితుల కారణంగా ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తూ, తనలో తాను మథనపడుతుంటాడు. ఈ క్రమంలో తన కల నెరవేర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఫ్రెండ్స్ కూడా పరమేశ్‌ని సపోర్ట్ చేస్తారు.
రెస్టారెంట్ పెట్టాలనే తన చిరకాల కోరికను తీర్చుకునేందుకు పరమేశ్, అతని బ్యాచ్ ఏం చేసింది? ఈ క్రమంలో వారికెదురైన నాటకీయ పరిణామాలు ఏంటి? మరోవైపు అనుకోకుండా వీరి లైఫ్ లోకి ఒక నిమ్మకాయ కథేంటి? అందులోని ఆత్మ ఎవరిది? అసలు అది ఆ నిమ్మకాయలో ఎందుకు ఉంది? దీనివలన వారికి ఎదురైన సమస్యలేంటి? చివరకు పరమేశ్ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:-
బకాసుర రెస్టారెంట్ కొత్త జానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పరిమెంట్ అని చెప్పొచ్చు. కథగా చూస్తే, తెలుగులో గతంలో వచ్చిన ‘యమలీల, ఘటోత్కచుడు’ సినిమాల తరహాలో ఉంటుంది. మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేదే ఈ కథ. ఆడియన్స్‌కి ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. హారర్ థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్ అన్నీ ఉంటాయి. సినిమా మొత్తం కంప్లీట్ ప్యాకేజీలా ఉంటుంది.
కథలోని ముఖ్య పాత్రల పరిచయంతో సినిమా నెమ్మదిగా ప్రారంభం అవుతుంది. జీవితంలో స్థిరపడేందుకు రెస్టారెంట్ పెట్టాలనుకునే యువకుడిగా ప్రవీణ్ కనిపిస్తాడు. ఇందుకోసం ఆయన చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. డబ్బు సంపాదనకు ఘోస్ట్ హంటింగ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం, అనుకోకుండా అతడి జీవితంలోకి ఓ తిండిపోతు దెయ్యం రావడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఇక్కడినుండి స్టోరీలో వేగం పెరుగుతుంది. దాని ఆకలి తీర్చడానికి ప్రవీణ్ పడే పాట్లు వినోదాత్మకంగా ఉంటాయి.
ఈ దెయ్యాన్ని వదిలించుకోవడానికి ప్రవీణ్ ప్రయత్నించడం, అతడిని వదిలివెళ్లకుండా వెంటపడే దెయ్యం.. ఇలా సినిమా అంతా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది. మధ్యలో హీరోయిన్‌తో ప్రవీణ్ లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఒకవైపు హాస్యాన్ని పంచుతూనే కొద్దిపాటి ఎమోషన్ ని కలిగిస్తాయి. మొత్తానికి ప్రేక్షకుడు థియేటర్ నుండి బయటకు వచ్చేతప్పుడు నవ్వుకుంటూ వస్తాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. సినిమా మొత్తానికి కీలకం ప్రవీణ్ మరియు వైవా హర్ష. కథ అంతా వీరిద్దరి పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. ప్రవీణ్‌కి ఇలాంటి పాత్రలు కొట్టినపిండి. అమాయకత్వంతో కూడిన కామెడీ ఆయన స్టైల్. ఇందులో కథానాయకుడైనా కూడా తన క్యారక్టర్ ఇలాగే ఉంటుంది. అలాగే వైవా హర్ష. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆయన ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాడు. వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్స్ అన్ని సినిమాకి హైలైట్. మొత్తానికి ఇది ప్రవీణ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రమవుతుంది.
ఫిమేల్ లీడ్ రోల్స్‌లో రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. వీరి పాత్రల నిడివి తక్కువే అయినా ఉన్న కొద్దిసేపు అలరిస్తారు. ఇక కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. అలాగే షైనింగ్ ఫణి (బమ్‌చిక్ బంటి), కేజీఎఫ్ గరుడరామ్, ఉప్పెన జయకృష్ణ, వివేక్ దండు, అమర్, రామ్ పటాస్, జబర్థస్త్ అప్పారావు తదితరుల నటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నవ్వించారు. ఇంతమంది కమెడియెన్స్ ఉండటం సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది.
ఇక సాంకేతికంగా చూస్తే, సినిమా చాలా బావుంది. వికాస్ బడిస సంగీతం సంగీతం సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. కేవలం పాటలే కాకుండా బీజీఎమ్ కూడా మెప్పిస్తుంది. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్ గా నిలిచింది. ఇలాంటి సినిమా ఆడియెన్‌కి కనెక్ట్ కావాలంటే ముఖ్యంగా కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో బాల సరస్వతి మ్యాజిక్ చేశారనే చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉండి విజువల్స్ అద్భుతంగా వున్నాయి.
అలాగే సీనియర్ ఎడిటర్ మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి ఆయన తన పనితనం ఏంటో ఈ సినిమాతో చూపించారు. మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా చేసిందంటే అందుకు మార్తాండ్ ప్రతిభే కారణం. తన షార్ప్ ఎడిటింగ్‌తో ఎక్కడా ఆ ఫీల్ కలుగకుండా చేశాడు. అలాగే నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. కథకి తగ్గట్టుగా ఖర్చుకి ఎక్కడ వెనుకాడలేదని అర్ధమవుతోంది.
ఓవరాల్‌గా మంచి అంచనాల మధ్య వచ్చిన బకాసుర రెస్టారెంట్ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించిందనే చెప్పాలి. డిఫరెంట్ జానర్ ఫిల్మ్ కావడంతో ప్రతిఒక్కరికీ చూడాలనే ఆసక్తి కలిగిస్తోంది. దీనికితోడు కథ, కథనం, డైరెక్షన్, ప్రవీణ్, వైవా హర్షల నటన.. అన్నీ కలగలిసి ఈ చిత్రాన్ని స్పెషల్‌గా మార్చాయి. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఇలాంటి సినిమాలు ప్రేక్షకుడికి ఒకింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ కోణంలో చూస్తే, బకాసుర రెస్టారెంట్ సక్సెస్ అయినట్టే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























