ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బుల్లెట్టు బండి’. ఇందులో ఆయన పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో లారెన్స్ సోదరుడు ఎల్విన్ వెండితెరకి పరిచయం అవుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ మూవీ నుండి టీజర్ విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య చేతులమీదుగా ఈ మూవీ టీజర్ రిలీజ్ కావడం విశేషం. ఈ సందర్భంగా చైతూ బుల్లెట్టు బండి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా.. కథిరేశన్ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
1980-90ల్లో అభిమానుల డ్రీమ్ గర్ల్‌గా వెలుగొందిన డిస్కో శాంతి శ్రీహరి ఈ సినిమా ద్వారా 28 ఏళ్ల తర్వాత సినీ రంగంలోకి తిరిగి అడుగుపెడుతున్నారు. 1997 తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. ఈ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాగే టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇంకా వైశాలి రాజ్, అరవింద్ ఆకాష్, కాలీ వెంకట్, రంగరాజ్ పాండే, ఆర్. సుందరరాజన్, చామ్స్, శివ శరా, కేపీవై వినోత్, విజే థనికై, సెండ్రాయన్ వంటి పలువురు నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం, ‘డీమోంట్ కాలనీ, డైరీ’ సినిమాల ఫేమ్ డిఓపీ అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫీ, వడివేల్ విమల్‌రాజ్ ఎడిటింగ్, ఫ్యాంటమ్ ప్రదీప్ స్టంట్స్ అందిస్తున్నారు. తెలుగులో పాటు తమిళంలోనూ తెరకెక్కుతోన్న ఈ సినిమా చెన్నై, తేంకాసి, కేరళతో పాటు పలు అద్భుతమైన లొకేషన్లలో షూట్ జరుపుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























