ది ప్యారడైజ్ నుండి నాని క్యారక్టర్ నేమ్ రివీల్

Team The Paradise Introduced Natural Star Nani as Jadal

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ ‘దసరా’ తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరాకు మించిన యాక్షన్‌తో దీనిని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. దీనికోసం ఆయన పవర్ ఫుల్ లార్జర్ దేన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా నానిని పూర్తిగా కొత్త, మాస్-డ్రైవ్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుంది. ఇందుకు నిదర్శనంగా మార్చి 3న ‘రా స్టేట్‌మెంట్’ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ బోల్డ్‌ అండ్ వైల్డ్‌గా రూపొందిన ఈ గ్లింప్స్‌లో నెవర్ బిఫోర్ రోల్‌లో కనిపించి నాని అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ నుండి తాజాగా మేకర్స్ హీరో నాని క్యారక్టర్ నేమ్ రివీల్ చేశారు.

‘జడల్’ అనే పవర్ ఫుల్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సందర్భంగా రియలైజ్ చేసిన పోస్టర్‌లో నాని ఇంటెన్స్ అండ్ ట్రెమండస్ లుక్‌తో కనిపించారు. రగ్గడ్ మీసం, గెడ్డం, రెండు జడలతో కనిపించిన నాని అదిరిపోయే ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆ రెండు జడలే ఆయనకు పేరుగా మారాయి. ఇందులో ఆయన పాత్ర పేరు “జడల్”. పేరు చాలా యూనిక్‌గా వుంది. పోస్టర్ కంపోజిషన్ మరింత ఫైర్‌ పెంచింది. ఆయన వెనక, కత్తులు-బుల్లెట్లతో తయారైన ఒక భారీ రౌండ్ వీల్ ఒక రకమైన డేంజర్‌ని చూస్తోంది.

పొగమంచులో ఎగిరే కాకులు ప్రతి ఎలిమెంట్‌లోనూ సింబాలిజం కట్టిపడేస్తోంది.“It started as a braid. It ended as a revolution.” అనే క్యాప్షన్ మరింత క్యురియాసిటీ పెంచింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలావుంటే ఈరోజు సాయంత్రం ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా రానుంది. ఈ మేరకు డైరెక్టర్ శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో ఈ మూవీ నుండి ఒకేరోజు రెండు క్రేజీ అప్డేట్స్ వెల్లడితో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడవ చిత్రం ఇది. ఇంతకుముందు వీరి కాంబోలో ‘జెర్సీ, గ్యాంగ్‌ లీడర్’ సినిమాలు వచ్చాయి. ఇవి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా వున్నాయి.

మరోవైపు దసరా కాంబోలో వస్తోన్న ది ప్యారడైజ్‌పై అంచనాలు ఎక్కువగా వున్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ దీనిని గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇంకా ఈ మూవీ ఇప్పటివరకు నాని యొక్క మోస్ట్ హై బడ్జెట్ వెంచర్‌ కావడం గమనార్హం. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్న ది ప్యారడైజ్ వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలలో పాన్ ఇండియా వైడ్‌గా విడుదలవుతోంది. అలాగే ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషలలో కూడా రిలీజ్ అవుతుండటం విశేషం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.