‘హరోం హర, మా నాన్న సూపర్ హీరో’ సినిమాలతో గతేడాది ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాని పరిచయం చేస్తూ విడుదల చేసిన మరో పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో సుధీర్ బాబు న్యూ అవతార్‌తో ఆకట్టుకున్నాడు. సోనాక్షి సిన్హా కూడా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించింది.
ఈ టీజర్ మిస్టరీ, పవర్, హై-స్టేక్స్ మైథాలజీతో నిండిన ప్రపంచాన్ని పరిచయం చేసింది. సుధీర్ బాబు ప్రజెన్స్ డివైన్ వైబ్స్ కలిగించింది. త్యాగంతో పుట్టిన రక్షకుడిగా కనిపించిన పాత్రలో ఆయన లుక్ అదిరిపోయింది. సోనాక్షి కలకలం సృష్టించే శక్తిగా కనిపించింది. ఈ మైథాలజికల్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ హై ఆక్టేన్ స్టోరీటెల్లింగ్, మైండ్‌బ్లోయింగ్ విజువల్స్ అదరగొట్టింది.
స్కేల్, మేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎక్జిక్యూషన్ అన్నింట్లోనూ ఈ టీజర్ ఒక అద్భుతమైన మైథాలజికల్ స్పెక్టకిల్ రాబోతుందనే హింట్ ఇచ్చింది. ‘జటాధర’లో ఇండియన్ హెరిటేజ్‌ని కటింగ్-ఎడ్జ్ గ్రాఫిక్స్, హై కాన్సెప్ట్ నేరేటివ్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతుంది.
ఇక ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండియర్ కనిపించింది. రిచ్ సెట్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎపిక్ స్టోరీ టెల్లింగ్‌తో ‘జటాధర’ బిగ్ సినిమాటిక్ ఈవెంట్ కానుంది. టీజర్ అయితే చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. విజనరీ టీమ్, జానర్ బౌండరీలు చెరిపేసే కాన్సెప్ట్‌తో, ‘జటాధర’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ రిలీజ్‌లలో ఒకటిగా వస్తోంది.
జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో., క్రియేటివ్ డైరెక్షన్ దివ్య విజయ్. జీ స్టూడియోస్ స్ట్రాటజిక్ విజనరీ ఉమేష్ కుమార్ బన్సాల్ మద్దతుతో, ప్రొడ్యూసర్స్ శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుుణ అగర్వాల్, శిల్ప సింగాల్, కో-ప్రొడ్యూసర్స్ అక్షయ్ కేజ్రివాల్, కుస్సుం అరోరా ఈ ప్రాజెక్ట్ కు మద్దత్తు ఇస్తున్నారు.
‘టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మాన్, పరి’ వంటి హిట్స్ ఇచ్చిన ప్రెర్ణా అరోరా మళ్లీ హై-కాన్సెప్ట్ సినిమాను రూపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న జటాధర ఇండియా సినిమాలో నెక్స్ట్ మైథాలజికల్ ఎపిక్‌గా మారబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























