పొలిటికల్ బిజీ లో కూడా కమిట్ అయినా సినిమాలను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు పవన్. గత నెలలో ఈసినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ కాగా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా షూటింగ్ గురించి నిర్మాతల్లో ఒకరైన మైత్రి నవీన్ అప్డేట్ ఇచ్చారు.పవన్ కళ్యాణ్ పాత్ర తాలూకు షూట్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ తరువాత మరో 25 రోజుల షూట్ బ్యాలెన్స్ వుంది. అక్టోబర్ లోపు ఈ షూట్ అంతా కంప్లీట్ కానుంది అయితే రిలీజ్ డేట్ గురించి ఇంకా ఏం ఆలోచించంలేదని నవీన్ తెలిపారు. హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీలీల ,రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఇక ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓజీ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మెహన్ హీరోయిన్ గా నటిస్తుంది.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈసినిమా పై అంచనాలు భారీగా వున్నాయి.కొద్దీ రోజుల క్రితం ఈసినిమా నుండి వచ్చిన ఫస్ సింగిల్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
పవన్ కు ఈఏడాది ఇది సెకండ్ రిలీజ్ కానుంది.గత నెలలో హరి హర వీరమల్లు పార్ట్ 1 తో రాగ ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. మరి ఓజీతో హిట్ కొట్టి పవన్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























