సు ఫ్రం సో.. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది – డైరెక్టర్ జేపీ తుమినాడ్

Su From So Director JP Thuminad Confident on Movie Success in Telugu

లేటెస్ట్ కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రం సో’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్‌కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్‌ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్ట్ 8న ఈ చిత్రం ఇక్కడ గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర దర్శకుడు జేపీ తుమినాడ్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. మీ అందరిని ఈ వేడుకలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కన్నడలో అద్భుతమైన విజయం సాధించింది. ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. తెలుగులో కూడా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్‌కి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అని చెప్పారు.

అలాగే నటుడు షనీల్ గౌతమ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా కన్నడలో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాము. ఈ సినిమాకి గొప్పగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.