ఘాటి ట్రైలర్ లో ఇవి గమనించారా..?

Anushka Shetty's Ghati Trailer Highlights

ప్రముఖ నటి అనుష్క శెట్టి, తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రభు లీడ్ క్యారెక్టర్స్‌లో నటించిన తాజా చిత్రం ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ 5న ఘాటి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా పవర్ ఫుల్ రోల్‌లో దర్శనమిచ్చారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

‘ఘాటి’ ట్రైలర్ హైలైట్స్..!

బ్రిటిష్ రాజ్ కాలంలో ప్రమాదకరమైన కనుమలలో చారిత్రాత్మకంగా రోడ్లు నిర్మించిన ఘాటి సమాజ ప్రపంచాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు, వారు కొండల్లో డ్రగ్స్ మోసే పనుల్లో చిక్కుకుపోయారు. ఈ కఠినమైన పరిస్థితులు చిక్కుకున్న ప్రేమికుల జంటగా అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు కనిపించారు.

అనుష్క పాత్ర అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తప్పు చేస్తున్నామనే గ్రహించి, ఈ చెడు వ్యవస్థకి ఎదురు నిలవడానికి రెడీ అవుతుంది. తన వాళ్లని ఈ ప్రమాదకర వ్యాపారం నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. చైతన్య రావు, రవీంద్రన్ విజయ్ విలన్ పాత్రల్లో ఆకట్టుకున్నారు. జగపతి బాబు ప్రజెన్స్ మరింత క్యూరియాసిటీ పెంచింది.

ట్రైలర్ లో అనుష్కను మునుపెప్పుడూ చూడని వైల్డ్ అవాతార్‌లో కనిపించారు. ఒక బలహీన మహిళ నుంచి క్రిమినల్‌, అక్కడి నుంచి లెజెండ్‌గా మారే ఆమె పాత్ర ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పాత్రకి ప్రాణం పోస్తుంది. విక్రమ్ ప్రభు పర్ఫార్మెన్స్‌ స్ట్రాంగ్ గా వుంది.

దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఒక ప్రత్యేకమైన, బోల్డ్ కథను తెరపైకి తెచ్చారు. ఎమోషన్, యాక్షన్‌తో కథ అద్భుతంగా నడిపించారు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ రెడ్డి కటసాని తీసిన విజువల్స్ చూస్తే… ఆ ఘాట్లు మన ముందుకొచ్చినట్టు ఫీలింగ్ కలుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ నాగవెల్లి విద్యాసాగర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌ని ఎలివేట్ చేసింది.

UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సెట్స్ వండర్ ఫుల్. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. ఎడిటర్స్ చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్. స్వామి ఇంటెన్స్ అండ్ షార్ప్‌గా కట్ చేశారు. యాక్షన్ మాస్టర్ రామ్ కృష్ణ ప్లాన్ చేసిన ఫైట్ సీన్స్ నెక్స్ట్ లెవల్‌లో వున్నాయి.

ఇక గ్రిప్పింగ్ కథనం, అద్భుతమైన పర్ఫార్మెన్సులు, టాప్ టెక్నికల్ వాల్యూస్‌‌‌‌‌‌‌‌తో ఘాటి సినిమా సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టబోతుంది. మూవీ లవర్స్‌కి థియేటర్లలో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.