విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకుంటోంది. ముఖ్యంగా ఈ మూవీకి నార్త్ అమెరికాలోని ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. విడుదలైన మొదటి రోజే 1 మిలియన్ కలెక్షన్ సాధించిన ఈ చిత్రం ఇప్పుడు రెండు మిలియన్ల దిశగా పరుగులే పెడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీమియర్ షోస్ నుంచే అక్కడ మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, కింగ్డమ్ నార్త్ అమెరికాలో 1.7 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్‌ను క్రాస్ చేసింది. ఇది ఓ తెలుగు చిత్రం పెద్ద మార్కెట్‌లో సాధించిన గర్వకారణమైన విజయంగా పేర్కొంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
అయితే కింగ్‌డమ్ కలెక్షన్ల హవా అమెరికాలో ఇంకా కొనసాగుతుందని, పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ వీకెండ్ వరకు కలెక్షన్ల జోరును కొనసాగించే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కంటెంట్, నటీనటుల ప్రదర్శన, విజువల్స్ అన్నీ కలిసొచ్చిన ఈ సినిమా, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు మరింత గుర్తింపు తీసుకొస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























