ప్రముఖ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటి’. తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రభు ‘దేశీ రాజు’ అనే లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కాగా ఇది బ్లాక్ బస్టర్ ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన అనుష్క ఈసారి ఆడియెన్స్‌ని మరింత సర్‌ప్రైజ్ చేశారు. ఈ ట్రైలర్ గమనిస్తే, ట్రైలర్ మొత్తం ఇంటెన్స్ యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతోంది.
ఈసారి అనుష్క శెట్టి ఒక మాస్ యాక్షన్ అవతారంలో అదరగొట్టబోతున్నారని అర్ధమవుతోంది. అనుష్క శెట్టి పాత్ర గంభీరంగా, పవర్‌ఫుల్‌గా ఉండడం స్పష్టంగా కనబడింది. తనదైన శైలి డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన మెప్పించాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్ని మెచ్చుకోవలసిన విధంగా ఉన్నాయి.
మొత్తానికి యాక్షన్, ఎమోషన్ కలగలసిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. దీంతో ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. అనుష్క అభిమానులు ఈ పాత్రను ఇప్పటి వరకు ఆమె చేసినవాటిలో భిన్నంగా భావిస్తున్నారు. దర్శకుడు రూపొందించిన విజన్, టెక్నికల్ టీం ప్రమాణాలు చూస్తే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వనుందని తెలుస్తోంది.
ఇక ట్రైలర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. సెప్టెంబర్ 5వ తేదీన ఘాటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అవుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























