కూలీ ట్రైలర్‌లో ఇవి గమనించారా..?

Coolie Trailer Highlights Lokesh-Rajinikanth Unleashed The Mass Mania

సూపర్ స్టార్ రజినీకాంత్‌, లోకేష్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచింది. ఇక విడుదలైన కొద్దిగంటల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యింది. రజినీ ఎనర్జీ, స్టైల్, మాస్ ఎలివేషన్‌లు ట్రైలర్‌లో హైలైట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కూలీ ట్రైలర్ హైలైట్స్..

  • ”ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలో తలమీద రాసిపెట్టి ఉంటుంది” అనే నాగార్జున పవర్ ఫుల్ డైలాగ్‌తో మొదలైంది.
  • ట్రైలర్ మొత్తం పవర్ ప్యాక్డ్ మూమెంట్స్‌తో గూస్ బంప్స్ తెప్పించింది.
  • ‘అడుగు పెడితే విజిలు మోగులే’ అనే పవర్ ఫుల్ బీజీఎంతో ‘దేవా’ పాత్రలో రజనీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది.
  • ట్రైలర్‌ మొత్తం రజినీ స్టైల్, స్వాగ్‌తో నిండిపోయింది.
  • ప్రతి ఫ్రేమ్‌లోనూ రజినీకాంత్ మాస్ ప్రెజెన్స్ చూపించారు.
  • లోకేష్ టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
  • పవర్‌పుల్ డైలాగ్స్‌, యాక్షన్ సీక్వెన్స్‌లు ట్రైలర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి.
  • నాగార్జున లుక్ ఆడియన్స్‌ని చాలా సర్‌ప్రైజ్ చేసింది. నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపించాడు.
  • నాగ్ క్యారెక్టర్ సినిమాలో ఎంత పవర్ ఫుల్‌గా వుంటుందో ట్రైలర్ తెలియజేసింది.
  • అలాగే సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌, రియల్ స్టార్ ఉపేంద్ర ఎంట్రీలు అదిరిపోయాయి.
  • ఇంకా సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతీ హాసన్ పాత్రలు చాలా ఆసక్తికరంగా వున్నాయి.
  • డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూలీ కోసం చేసిన వరల్డ్ బిల్డింగ్ అద్భుతంగా వుంది.
  • ఆయన టేకింగ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది.
  • ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్‌లో వుంది.
  • ట్రైలర్ చివరలో వచ్చే కూలీ ట్యాగ్‌తో ఉన్న సీక్వెన్స్ గూస్ బంప్స్ ఎఫెక్ట్ ఇచ్చింది.
  • అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. గూస్ బంప్స్ బీజీఎం ఇచ్చాడు.
  • గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీ వుంది. విజవల్స్ చాలా గ్రాండియర్‌గా వున్నాయి.
  • కళానిధి మారన్ సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉన్నాయి.
  • మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలని డబుల్ చేసింది.

రజినీకాంత్ – లోకేష్ కలయిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలుసుకోవాలంటే రిలీజ్ కోసం వేచి చూడాల్సిందే! కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.