71 జాతీయ చలన చిత్ర అవార్డులను కొద్దిసేపటి క్రితం కేంద్రం ప్రకటించింది . 2023కు గాను ఈ అవార్డులను ప్రకటించగా ఇందులో ఉత్తమ తెలుగు సినిమాగా భగవంత్ కేసరి జాతీయ అవార్డును దక్కించుకుంది.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన ఈసినిమా కమర్షియల్ గాను భారీ విజయాన్ని అందుకోగా ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును గెలుచుకుంది.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అలాగే పలు విభాగాల్లో కూడా మరికొన్ని తెలుగు సినిమాలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి.అందులో భాగంగా బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా హనుమాన్ సినిమాకు గాను నందు & పృథ్వీ అవార్డు దక్కించుకోగా ఉత్తమ గేయ రచయిత గా కాసర్ల శ్యామ్ అవార్డును కైవసం చేసుకున్నారు.బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకి గాను శ్యామ్ ఈ అవార్డు గెలుచుకున్నారు.ఇక ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీ సినిమాలో ప్రేమిస్తున్నా అనే పాటకు గాను పివిఎన్ ఎస్ రోహిత్ అవార్డు దక్కించుకోగా ఇదే సినిమాకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు సాయి రాజేష్ అవార్డు ఎంపికైయ్యాడు.అలాగే ఉత్తమ బాల నటిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి అవార్డు గెలుచుకుంది.గాంధీతాతా చెట్టు లో నటనకు గాను సుకృతిని ఈ అవార్డు వరించింది.
ఇక అలాగే బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో తమిళ సినిమా పార్కింగ్ అవార్డు గెలుచుకోగా ఉత్తమ నటి గా హిందీ హీరోయిన్ రాణి ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) అవార్డు గెలుచుకుంది. అలాగే ఉత్తమ హీరో విభాగంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ( జవాన్) అలాగే విక్రాంత్ మస్సి ( 12th ఫెయిల్) అవార్డు గెలుచుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























