మచ్ అవైటెడ్ కూలీ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఈసినిమాపై తమిళ్ లోనే కాదు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.అయితే సెన్సార్ బోర్డు ఈసినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది.వైలెన్స్ ఎక్కువుండడంతో ఈ సర్టిఫికేట్ ను జారీ చేశారు.దాంతో పిల్లలు చూడడానికి వీలు లేదు.మరి ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి ఈసినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా రేపు చెన్నై లో భారీ ఈవెంట్ జరుగనుంది.దీనికి కూలీ టీం అంతా హాజరుకానుంది.ఇందులో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.దాంతో అందరి చూపు ఈ ట్రైలర్ పైనే వుంది.అలాగే వచ్చే వారంలో తెలుగులోనూ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా నాగార్జున విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఉపేంద్ర ,సత్య రాజ్ ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కూలీ 1000 కోట్ల సినిమా అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























