అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్ 

arabia-kadali-official-trailer-out-now

కొన్ని కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి.మరికొన్ని తెరపై చూస్తే మనసును కదిలిస్తాయి.అలాంటి ఒక బలమైన కథతో వస్తున్నారు సత్యదేవ్. ఆయన నటించిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ అరేబియా కడలి.ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రిష్ జాగర్లమూడి సమర్పణలో, వి. వి.సూర్య కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్, సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల హృదయవిదారక కథను ఆవిష్కరించనుంది.అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటి,విదేశీ గడ్డపై బందీలుగా మారిన వారి పోరాటం, బంధాలు, ఆశల గురించి ఈ సిరీస్ వివరంగా చూపించనుంది.

ట్రైలర్లో కనిపించిన దృశ్యాలు,సంభాషణలు, నేపథ్య సంగీతం సిరీస్కు హై-ఇంటెన్సిటీ డ్రామాను అందిస్తున్నాయి.సత్యదేవ్ ‘బదిరి’ పాత్రలో, ఆనంది ‘గంగ’ పాత్రలో ఒదిగిపోయినట్లున్నారు.ఇతర నటులైన నజర్, రఘు బాబు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు సూర్య కుమార్ మాట్లాడుతూ ..ఇది కేవలం బ్రతకడం గురించి కాదు, మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొక రు అండగా నిలబడతారో చూపిస్తుంది అని చెప్పడం సిరీస్ థీమ్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తుంది.సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.