వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా తలవైన్ తలైవి. ఏ రగ్గడ్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. పాండిరాజ్ డైరెక్ట్ చేయగా సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.ఇటివలే తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది.ఆగస్టు 1న తెలుగులో గ్రాండ్ గా సార్ మేడమ్ అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో హీరోయిన్ నిత్యామీనన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.తెలుగులో సినిమా చేసి చాలా రోజులు అయింది.అందుకే ఈ సినిమాకి తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాలని అనుకున్నాను.ఈ సినిమా విషయంలో చాలా ఆనందంగా ఉంది. విజయ్ గారితో నేను ఆల్రెడీ ఒక సినిమా కలిసి చేశాను.అదొక డిఫరెంట్ సినిమా.అందులో సైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది.పాండిరాజ్ గారు అద్భుతమైన డైరెక్టర్.ఈ కథ వినగానే ఓకే చేశాను.
ఇది ఒక హీరో హీరోయిన్స్ సినిమా కాదు ఒక ఫ్యామిలీ లాగా ఉండే సినిమా.ఆఫ్ స్క్రీన్ కూడా మేము అందరం ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం.ఈసినిమా కెమెరా వర్క్, మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి.నేను నందిని ఇద్దరం కలిసి సినిమా చూసాము.చాలా ఎంజాయ్ చేసాము.తమిళ్లో సినిమా చాలా పెద్ద హిట్ అయింది.నెంబర్స్ తో పాటు అందరి మనసులో కూడా చాలా పెద్ద హిట్ అయింది.తెలుగులో కూడా అంత పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.ఇది అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. తమిళ్ లాగే తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























