కన్నడ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను కురిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా ఎక్సలెంట్ రివ్యూస్ ని మౌత్ టాక్ ని రాబట్టుకోవడంతో రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. 3రోజుల్లో ఈసినిమా 11.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులోకూడా ఈసినిమా అద్భుతమైన రన్ ను కొనసాగిస్తోంది లిమిటెడ్ స్క్రీన్ లలో విడుదలవ్వడంతో నిన్న టికెట్స్ దొరకని పరిస్థితి.ఫుల్ రన్ లో ఈసినిమా 50కోట్ల మార్క్ ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ మూవీని తెలుగు రాష్ట్రాలలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలైంది.
ఇక ఈ ప్రతిష్టాత్మక యానిమేటెడ్ ఫ్రాంచైజీ లైనప్‌ను ఇటీవలే మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.ఇది ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగనుంది.పురాణాలలో చెప్పబడిన మహా విష్ణువు దశావతారాలను తెరపైకి ఆవిష్కరిస్తుంది.దీనిలో భాగంగా ముందుగా మహావతార్ నరసింహ రిలీజ్ అవ్వగా మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) రాబోతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























