టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో మేకర్స్‌కి గుడ్ న్యూస్ అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచేందుకు కింగ్‌డమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీనిప్రకారం, సింగిల్ స్క్రీన్లకు ₹50/- (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ థియేటర్లకు ₹75/- (జీఎస్టీతో కలిపి) పెంపునకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది.
అయితే ఈ పెంపు సినిమా విడుదలైన రోజున అంటే జూలై 31 నుండి ఆగస్టు 8 వరకు మొత్తం 10 రోజులపాటు వర్తించనుంది. 10 రోజుల తర్వాత మళ్లీ యధాతథ ధరలు అమలులోకి వస్తాయి. అలాగే థియేటర్లలో సినిమా ప్రత్యేక ప్రదర్శనల (బెనిఫిట్ షోస్)కు కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిర్మాతల అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అధికారులు.

ఇక ఇదిలావుంటే, మరోవైపు ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తాజాగా బుక్ మై షోలో 1000K కి పైగా ఇంట్రెస్ట్స్ అందుకోవడాన్నిబట్టి ఈ మూవీపై ఎంత క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. నటుడు సత్యదేవ్ ఇందులో విజయ్ దేవరకొండకు అన్నగా నటిస్తున్న విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. జోమోన్ T. జాన్ సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























